పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి
- January 18, 2019
కొలంబియాలో పోలీసు అకాడమీ ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 68 మంది గాయపడ్డారు. పేలుడుతో బొగట నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు అకాడమీ దగ్గర ఉన్న బిల్డింగ్లు పేలుడు ప్రభావానికి లోనయ్యాయి. రూఫ్టాప్ల టైల్స్ ఎగిరిపోయాయి. ఉగ్రదాడి వల్ల మృతిచెందిన పోలీసులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు బొగట మేయర్ తన ట్వీట్లో తెలిపారు. డ్రగ్ ట్రాఫికర్స్, లెఫ్టిస్ట్ గెరిల్లాల మధ్య తరుచూ కొలంబియాలో కారు బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా పేలుడుకు మాత్రం ఇంత వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్