గాల్లోనే ఢీకొన్న రెండు రష్యన్ ఫైటర్ జెట్స్
- January 18, 2019
రష్యాకు చెందిన రెండు సుఖోయ్ ఫైటర్ జెట్స్ గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. జపాన్ సముద్రంపై ఎగురుతున్న సమయంలో ఈ రెండు సు-34 శిక్షణ విమానాలు ఢీకొన్నట్లు రష్యన్ మిలిటరీ వెల్లడించింది. జపాన్ సముద్ర తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉన్న పైలట్లు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక పైలట్.. సముద్రంలో ఓ తెప్పపై వెళ్తూ కనిపించాడు. అతడు తన ఎమర్జెన్సీ లైట్ ద్వారా సముద్రంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. అయితే సముద్రంలో బలమైన గాలుల కారణంగా పైలట్‌ను రక్షించే చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే అతని దగ్గరికి వెళ్తామని రష్యన్ మిలిటరీ చెప్పింది. ఇతర పైలట్ల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. జెట్స్ ఏమయ్యాయన్న దానిపైనా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫైటర్ జెట్స్‌లో ఎలాంటి మిస్సైల్స్ లేవని మాత్రం మిలిటరీ చెప్పింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!