‘ఓలా’ ప్రయాణీకులకు గుడ్న్యూస్..
- January 19, 2019
రండి.. రండి.. వచ్చేయండి. ఎక్కడికి వెళ్లాలో చెప్పేయండి.. జేబులో డబ్బులు లేవా.. అయినా పర్లేదు 15రోజులు టైమిస్తున్నాం.. ఆలోపు కట్టేయండి అంటూ ఓ తీపి కబురు అందిస్తోంది క్యాబ్ సేవల సంస్థ ఓలా.
మనీ పోస్ట్ పెయిడ్ పేరిట ఓలా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఒక సారి ఎక్కిన తరువాత 15 రోజుల్లోపు ఎప్పుడైనా పేచేయొచ్చు. లేదంటే.. రోజూ ఎక్కినా 15 రోజులకు కలిపి ఒకేసారి పే చెయ్యొచ్చు.
ప్రస్తుతం కొంత మంది కస్టమర్లకే ఈ అవకాశాన్ని అందిస్తున్నప్పటికీ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ చెబుతోంది. గత ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఆఫర్ని ప్రారంభించగా కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఓలా తెలిపింది.
15 కోట్లకు పైగా కస్టమర్లకు తమ సేవలను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్న తర్వాత 15 రోజుల్లోపు ఎలాంటి పాస్ వర్డ్, ఓటీపీ అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!