సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్‌: ఫొటో కాంపిటీషన్‌ ప్రారంభం

- January 19, 2019 , by Maagulf
సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్‌: ఫొటో కాంపిటీషన్‌ ప్రారంభం

జెడ్డా: 100,000 సౌదీ రియాల్స్‌ ప్రైజ్‌ మనీతో ఫొటోగ్రాఫిక్‌ కాంపిటీషన్‌ని మేజర్‌ ఫాల్కన్రీ ఈవెంట్‌లో భాగంగా ప్రారంభించారు. అమెచ్యూర్‌ మరియు ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అర్హులు. కింగ్‌ అబ్దుల్‌ ఫాల్కన్రీ ఫెస్టివల్‌లో భాగంగా ఈ కాంపిటీన్‌ని నిర్వహిస్తున్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు రియాద్‌ సమీపంలో మల్హామ్‌ టౌన్‌లో ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఫొటో కాంపిటీషన్‌ రెండో బహుమతి 50,000 సౌదీ రియాల్స్‌ కాగా, మూడో బహుమతిగా 20,000 సౌదీ రియాల్స్‌ అందజేస్తారు. ఇ-మెయిల్‌ ద్వారా ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోని పంపవలసి వుంటుంది. సౌదీ ఫాల్కన్స్‌ క్లబ్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు లభిస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com