స్కూల్‌ బస్‌ స్టాప్‌ సైన్‌ని ఉల్లంఘిస్తే 1000 దిర్హామ్‌ల జరీమానా

- January 19, 2019 , by Maagulf
స్కూల్‌ బస్‌ స్టాప్‌ సైన్‌ని ఉల్లంఘిస్తే 1000 దిర్హామ్‌ల జరీమానా

స్కూల్‌ బస్‌లు ఆగిన వెంటనే పిల్లలు దిగేందుకు వీలుగా స్టాప్‌ సైన్స్‌ తెరచుకుంటాయి. వాటిని చూసి వెనుకాల వున్న వాహనాలు తప్పనిసరిగా ఆగాల్సి వుంటుంది. స్కూలు పిల్లల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు తమ వాహనాల్ని దూకుడుగా ముందుకు నడిపిస్తుంటారు. అలాంటివారికి 1009 దిర్హామ్‌ల జరీమానా తప్పదని అబుదాబీ ట్రాఫిక్‌ అథారిటీస్‌ వాహనదారుల్ని హెచ్చరించించడం జరిగింది. బస్‌ నుంచి ఐదు మీటర్ల కంటే తక్కువ దూరంలో ఆపే వాహనాలకూ ఈ జరీమానా తప్పదు. అలాగే 10 బ్లాక్‌ పాయింట్స్‌ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది ఉల్లంఘించినేవారికి. వన్‌ వే స్ట్రీట్‌పై రెండు వైపులా వాహనాలు స్కూల్‌ బస్‌ స్టాప్‌ సైన్‌ని చూసి ఆగాల్సి వుంటుంది. అదే రెండు మార్గాలున్న రహదారి అయితే స్కూల్‌ బస్‌ నిలిపివేసిన వైపు మాత్రమే వాహనాలు ఆగాలి. విద్యార్థుల్ని కిందికి దించే సమయంలో స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ స్టాప్‌ సైన్‌ ఆర్మ్స్‌ని దించకపోతే 500 దిర్హామ్‌ల జరీమానా, ఆరు బ్లాక్‌ పాయింట్స్‌ విధిస్తారని చట్టం చెబుతోంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com