కోల్కతా సభకు హాజరైన నేతలు వీరే..
- January 19, 2019
కోల్కతా:మోడీ వ్యతిరేక విధానాలపై కోల్కతా వేదికగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో… విపక్షాలు సమర శంఖం పూరిస్తున్నాయి. కోల్కతాలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇండియా ర్యాలీలో బీజేపీయేతర పార్టీల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కర్ణాటక సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా, డీఎంకే నేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్తో పాటు కాంగ్రెస్ తరఫున ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వ పాల్గొంటున్నారు. దాదాపు 20 పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యాయి. అటు.. ఈ ర్యాలీగా భారీగా జనం తరలివచ్చారు.
అటు.. కోల్కతాలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీయేతర కూటమి తదుపరి కార్యాచరణపై గత అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన సీఎం….ఇవాళ కూడా పలువురు నేతలతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మమత ర్యాలీ అనంతరం చంద్రబాబు నేతృత్వంలో 20పార్టీల నేతలు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!