థాయి ఆలయంలో కాల్పులు..ఇద్దరు బౌద్ధ సన్యాసులు మృతి

- January 20, 2019 , by Maagulf
థాయి ఆలయంలో కాల్పులు..ఇద్దరు బౌద్ధ సన్యాసులు మృతి

థాయిలాండ్‌: దక్షిణ నారాతైవాత్‌ ప్రావిన్స్‌లోని ఒక ఆలయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు బౌద్ధ సన్యాసులను కాల్చిచంపారు. మరో ఇద్దరిని గాయపరిచారు.. ఈ ప్రావిన్స్‌లో ప్రధానంగా మలరు, ముస్లిం జనాభా ఎక్కువ. ఆరుగురు దుండగులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని, వారందరూ పరారీలో వున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స చేసి పంపించేశారు. దక్షిణ థాయిలాండ్‌లో 15ఏళ్ళ నుండి వేర్పాటువాద తీవ్రవాదం ప్రబలి వుంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 6900 మంది మరణించగా, 13వేల మందికి పైగా గాయపడ్డారని స్వతంత్ర పర్యవేక్షక గ్రూపు దీప్‌ సౌత్‌ వాచ్‌ తెలిపింది. ఇక్కడ దాడుల్లో తరచుగా బౌద్ధులను, ముస్లిములను, మత నేతలను లక్ష్యంగా చేసుకుంటూ వుంటారు. కాగా ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com