థాయి ఆలయంలో కాల్పులు..ఇద్దరు బౌద్ధ సన్యాసులు మృతి
- January 20, 2019
థాయిలాండ్: దక్షిణ నారాతైవాత్ ప్రావిన్స్‌లోని ఒక ఆలయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు బౌద్ధ సన్యాసులను కాల్చిచంపారు. మరో ఇద్దరిని గాయపరిచారు.. ఈ ప్రావిన్స్‌లో ప్రధానంగా మలరు, ముస్లిం జనాభా ఎక్కువ. ఆరుగురు దుండగులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని, వారందరూ పరారీలో వున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స చేసి పంపించేశారు. దక్షిణ థాయిలాండ్‌లో 15ఏళ్ళ నుండి వేర్పాటువాద తీవ్రవాదం ప్రబలి వుంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 6900 మంది మరణించగా, 13వేల మందికి పైగా గాయపడ్డారని స్వతంత్ర పర్యవేక్షక గ్రూపు దీప్ సౌత్ వాచ్ తెలిపింది. ఇక్కడ దాడుల్లో తరచుగా బౌద్ధులను, ముస్లిములను, మత నేతలను లక్ష్యంగా చేసుకుంటూ వుంటారు. కాగా ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్