ఆర్ధికవృద్ధిలో బ్రిటన్‌ను మించిపోతున్న భారత్‌

- January 21, 2019 , by Maagulf
ఆర్ధికవృద్ధిలో బ్రిటన్‌ను మించిపోతున్న భారత్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ ఉన్న దేశంగా భారత్‌ త్వరలోనే బ్రిటన్‌ను అధిగమిస్తుందని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే అంచనావేసాయి. 2019 ఆర్ధికసంవత్సరంలో 7.6శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రైస్‌వాటర్‌కూపర్స్‌ అంచనావేసింది. ఇదే తీరులో 2019లోనే భారత్‌ బ్రిటన్‌ను ఆర్ధికవృద్ధిపరంగా అధిగమిస్తుందని పిడబ్ల్యుసి అంచనావేసింది. యుకె, ఫ్రాన్స్‌ దేశాలు అదేస్థాయిలో ఇప్పటివరకూ పోటీపడుతూ వస్తున్నాయి. ఈ రెండుదేశాల్లోను అభివృద్ధి, జనాభా రెండూ కూడా సమానంగానే ఉనానయి. ఈ రెండుదేశాలను భారత్‌ శాశ్వత ప్రాతిపదికన అధిగమిస్తుందని పిడబ్ల్యుసి అంచనావేసింది. సంస్థ గ్లోబల్‌ ఎకానమీ వాచ్‌ నివేదిక వాస్తవ జిడిపి వృద్ధి యుకెకు 1.6శాతం ఉందని, ఫ్రాన్స్‌కు 1.7శాతం ఉంటే భారత్‌కు 2019లో 7.6శాతం ఉంటుందని అంచనావేసింది. భారత్‌ఫ్రాన్స్‌ దేశాలు రెండూ కూడా బ్రిటన్‌ను ఆర్ధికవృద్ధిలో అధిగమించి ప్రపంచస్థాయిలో ర్యాంకింగ్‌ పెంచుకుంటాయని ప్రైస్‌వాటర్‌కూపర్స్‌ అంచనావేసింది. ప్రపంచ బ్యాంకు గణాంకాలను చూస్తే భారత్‌ ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద దేశంగా 2017లో నమోదయింది. ఫ్రాన్స్‌ను అధిగమించింది. ఇపుడు బ్రిటన్‌నుసైతం అధిగమించి ఐదోస్థానంలోనికి వస్తుంది. ప్రైస్‌వాటర్‌కూపర్స్‌ ప్రపంచ ఆర్ధికవ్యవస్థల నివేదికను బట్టిచూస్తే ప్రపంచ ఆర్ధికవ్యవస్థ తాజా వృద్ధి సానుకూలంగా ఉంది.

అంతేకాకుండా భారత్‌ప్రపంచస్థాయిలోనే అత్యంత అగ్రగామి ఆర్ధికవ్యవస్థగా అవతరిస్తుందని జోస్యం పలికింది. 2019-20లో భారత్‌ 7.6శాతం వృద్ధిన ఇసాధిస్తుందని ఎలాంటి సమస్యలు లేవని, ప్రపంచ ఆర్ధికవవ్యవస్థపరంగాచూస్తే వాణిజ్య ఉద్రిక్తతలు సరఫరావైపు కొంత ఉన్నాయి. వీటివల్ల ముడిచమురురంగాన్ని కొంత ఒడిదొడుకులకు లోనుచేసాయి. కొత్తగా అమలుచేసిన జిఎస్‌టి, విధాన ప్రభావం మొదటిసంవత్సరంలో ప్రభుత్వాన్ని వణికించిందిఅయితే ఆ తర్వాత క్రమేపీ కోలుకుందని అంచనావేసింది.

తక్కువస్థాయి తలసరి ఆదాయం ఉండటం కూడా కొంత భారంగా మారింది. యుకె, ఫ్రాన్స్‌లు అతిపెద్ద ఆర్ధికవ్యవస్థలు కలిగ ఇఉన్నప్పటికీ 2018లో కొంతమేర వెనకంజవేసాయి. మళ్లీ 2019లో కూడా అదే తీరులో ఉండవచ్చని అంచనా. యూరో, పౌండ్‌ల మారకంవిలువలు కూడా ఇక్కడ కీలకం అవుతున్నాయి.

ఆర్ధికవృద్ధి 2019లో కొంత మందగమనంతో ఉంటుందని, జి7 దేశాలు దీర్ఘకాలికంగా నమోదుచేస్తున్న సగటు వృద్ధిరేట్లు కొంతమేర ప్రభావితంచేస్తాయని అంచనా. 2017లో భారత్‌ జిడిపి 2.59 లక్షలకోట్ల డాలర్లుగా ఉంది. ఫ్రాన్స్‌ 2.58 లక్షలకోట్ల డాలర్ల జిడిపితో ఉంటే బ్రిటన్‌ 2.62 లక్షలకోట్ల డాలర్లతో ఉంది. భారత్‌తోపోలిస్తే 25 బిలియన్‌ డాలర్లు అధిక జిడిపితో ఉంది.

కేవలం రెండేళ్ల కాలంలోనే బ్రిటన్‌ను అధిగమించేస్థాయికి భారత్‌ వచ్చింది. ఇక ప్రపంచంలోనే అగ్రగామిదేశంగా అమెరికా నమోదయింది. 19.39 లక్షలకోట్ల డాలర్ల జిడిపితో ఉంటే చైనా 12.23 లక్షలకోట్ల డాలర్లు, రెండోస్థానంలో నిలిచింది. జపాన్‌ 4.87 లక్షలకోట్ల డాలర్లు,జర్మనీ 3.67 లక్షలకోట్ల డాలర్లతో మూడునాలుగుస్థానాల్లో నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com