2019 ఎన్నికలకు సిద్ధం కావాలి : చంద్రబాబు

- January 21, 2019 , by Maagulf
2019 ఎన్నికలకు సిద్ధం కావాలి : చంద్రబాబు

2019 ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. అమరావతిలో టీడీపీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యకతన సమన్వయ కమిటీ సమావేశంలో అంశాలపై చర్చించారు. త్వరలో అమల్లోకి తేనున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. రైతు రక్ష పథకం, పసుపు కుంకుమ పథకాలపై సమీక్షించారు. ఎన్నికలకు వెళ్లేలోగా వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు కసరత్తు చేయాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు, అసెంబ్లీ సమావేశాలు, జయహో బీసీ సభ, అమరావతి ధర్మ పోరాట సభపై కూడా భేటీలో చర్చించారు.

ప్రభుత్వ పథకాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అంటించాలని నేతలను ఆదేశించారు చంద్రబాబు. టీడీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని..అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఆహ్వానించాలని సూచించారు. అలాగే ఎన్నికల మానిఫెస్టోను రూపొందించుకోవాలని ఆదేశించారు. దేశంలో రైతులకు ఎక్కువ న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని.. తెలంగాణ రైతులకు చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువని విమర్శించారు సీఎం చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com