కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం...

- January 21, 2019 , by Maagulf
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం...

కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడడంతో 16 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. ర్మగూడజత్రాలో జరుగుతున్న జాతరకు హాజరై తిరిగివెళ్తుండగా కార్వార్‌ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న అధికారులు సముద్రంలో గాలించారు.

దీంతో 16 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు 24 మంది ఉన్నారు. హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గల్లంతైన ఎనిమిది మంది కోసం గాలింపు చేపట్టారు. ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com