ఏడేళ్ళ బాలుడి మృతిపై విచారణ ప్రారంభం

- January 22, 2019 , by Maagulf
ఏడేళ్ళ బాలుడి మృతిపై విచారణ ప్రారంభం

ఏడేళ్ళ చిన్నారి మృతిపై అజ్మన్‌ పోలీస్‌ అథారిటీస్‌ విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అజ్మన్‌ పోలీస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ చిన్నారి మృతిపై కారణాల్ని తెలుసుకునేందుకుగాను విచారణ చేపడుతున్నాయి. మినిస్ట్రీ, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడ్తాయి. విద్యార్థుల భద్రత విషయంలో మినిస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఓ ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. రూల్స్‌ మరియు రెగ్యులేషన్స్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com