బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలిని
- January 22, 2019
తెలుగు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ అమ్మాయి కుర్రకారు మనసులను కొల్లగొట్టేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో తమిళ.. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలోనే హిందీలో ఒక భారీ ఆఫర్ ఈ సుందరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా అనురాగ్ కశ్యప్ 'బాంఫాడ్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దర్శక నిర్మాతగా అనురాగ్ కశ్యప్ కి మంచి పేరు వుంది. ఆయన సినిమాలో ఛాన్స్ దొరకడం అంటే సగం సక్సెస్ కొట్టేసినట్టే అనే టాక్ వుంది. ఈ సినిమాతో షాలినీ పాండే దశ తిరిగిపోతుందనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!