ర్యాఫిల్ గెల్చిన ఆనందంతో స్వదేశానికి..
- January 22, 2019
దుబాయ్:ఆసియా జాతీయుడొకరు, బ్రిటిష్ జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఆనందంతో స్వదేశాలకు పయనమయ్యారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె విజేతలుగా ఈ ఇద్దరూ చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే 49 ఏళ్ళ నీల్ హెచ్ అనే బ్రిటిష్ వ్యక్తి, 12 ఏళ్ళుగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న నీల్, 291 సిరీస్ 1927 నెంబర్ టిక్కెట్‌తో రఫాలె గెల్చుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ మరియు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండో విజేత అభిషేక్ ఖతెల్ 292 సిరీస్‌లో 2582 టిక్కెట్‌పై బహుమతిని గెల్చుకున్నారు. యూఏఈ బేస్డ్ ఎయిర్‌లైన్‌లో ఈయన క్యాబిన్ క్రూగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా 27 ఏళ్ళ లీపిక అహ్లువాలె దుబాయ్ రఫాలెలో ఆడి ఆర్8 ఆర్‌డబ్ల్యుఎస్ వి10 కపుల్ కారుని గెల్చుకున్నారు. మరోపక్క రాంచీకి చెందిన 14 ఏళ్ళ ఫర్హాన్ జావెద్ ఖాన్ బిఎండబ్ల్యు ఆర్ 1200 జిఎస్ రాయల్ ఎడిషన్ మోటర్ బైక్‌ని గెల్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!