బరిలోకి దిగిన ప్రియాంక పై 'పాత్రా' ఏమన్నారో చూడండి
- January 23, 2019
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ స్పందించింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఫెయిలైనట్లు ప్రియాంకా ఎంట్రీతో కాంగ్రెస్ అంగీకరించిందని బీజేపీ సెటైర్ వేసింది. మహాకూటమి కోసం ప్రయత్నించినా చాలా వరకు పార్టీలు నో చెప్పడంతో చివరికి రాహుల్ కుటుంబ కూటమి వైపు మొగ్గు చూపారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. యూపీ ఈస్ట్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించిన వెంటనే బీజేపీ ఇలా కౌంటర్ ఇచ్చింది. ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని తెరపైకి తీసుకురావడం ఊహించిందే అని పాత్రా అన్నారు. కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలో అన్ని నియామకాలు ఆ ఒక్క కుటుంబం నుంచే జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు మధ్య ఉన్న తేడా అదే. కాంగ్రెస్‌లో కుటుంబమే పార్టీ, బీజేపీకి పార్టీయే కుటుంబం అని సంబిత్ పాత్రా అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా