యూఏఈలో మూడు రోజుల్లోనే ఇండియన్స్‌కి పాస్‌పోర్ట్‌

- January 23, 2019 , by Maagulf
యూఏఈలో మూడు రోజుల్లోనే ఇండియన్స్‌కి పాస్‌పోర్ట్‌

దుబాయ్‌: యూఏఈలో ఇండియన్స్‌ కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌లను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్‌ డిప్లమాట్స్‌ వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ ఇష్యూయెన్స్‌ టైమ్‌ని సగానికి తగ్గించేందుకుగాను ఆన్‌లైన్‌ పాస్‌పోర్ట్‌ సిస్టమ్‌ని సెంట్రలైజ్డ్‌ చేయనునట్లు అధికారులు తెలిపారు. వారణాసిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌ కన్వెన్షన్‌లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చిప్‌ బేస్డ్‌ ఇ-పాస్‌పోర్ట్స్‌ని ఇండియన్‌ సిటిజన్స్‌ కోసం రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ ఎంబసీలు పాస్‌పోర్ట్‌ సేవా ప్రాజెక్ట్‌తో కనెక్ట్‌ అయి వున్నాయని మోడీ అన్నారు. వీసా నుంచి పిఐఓ (పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌) మరియు ఓసిఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డ్స్‌కి సంబంధించి ప్రాసెస్‌ నడుస్తోందని తెలిపారాయన. యూఏఈలో టాప్‌ ఇండియన్‌ డిప్లమాట్స్‌ ఈ విషయమై స్పందిస్తూ, ఇండియాలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర ప్రాజెక్ట్‌తో తమ సిస్టమ్స్‌ కనెక్షన్‌కి సంబంధించి ఇంటిగ్రేషన్‌ ప్రిపరేషన్స్‌ జరుగుతున్నాయని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com