రామ్, పూరిజగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర షూటింగ్ ప్రారంభం..!!
- January 25, 2019
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమయ్యింది..'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమా లో కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రామ్ పాత్ర కు తగినవిధంగా వైవిధ్యంగా ఉండడం విశేషం.. ఈ లాంగ్ షెడ్యూల్ లో హీరో రామ్ పై పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి..
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి
పాటల రచయిత: భాస్కరభట్ల
ఫైట్స్ : రియల్ సతీష్
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







