ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

- January 26, 2019 , by Maagulf
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

 

ఢిల్లీలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలను ప్రదర్శిస్తున్నారు. అంతకుముందు ఇండియా గేట్‌ వద్ద అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పాంజలి ఘటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com