హైదరాబాద్:వేగంగా జరుగుతున్న నుమాయిష్ పునరుద్ధరణ పనులు

- February 01, 2019 , by Maagulf
హైదరాబాద్:వేగంగా జరుగుతున్న నుమాయిష్ పునరుద్ధరణ పనులు

హైదరాబాద్‌ అంటే చార్మినార్, ట్యాంక్‌బండే కాదు, జనవరిలో జరిగే నుమాయిష్ కూడా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహించే నుమాయిష్‌కు 79 ఏళ్ల చరిత్ర ఉంది. వందల కొద్దీ స్టాళ్లు కొలువుదీరుతాయి. దేశం నలుమూలల నుంచి ఎందరో వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. 45 రోజులు పాటు ఉండే ఎగ్జిబిషన్ కు ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జనం తరలివస్తుంటారు.

 
నుమాయిష్ చరిత్రలోనే మొన్నటి బుధవారం ఓ దుర్దినం. ఓ స్టాళ్లో ఎగిసిపడ్డ మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. సుమారు 300 స్టాళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. ప్రాణనష్టం తప్పినా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

అగ్నిప్రమాదంలో షాపులు కోల్పోయిన వ్యాపారులు ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. సొసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. డబ్బుల మీద ఉన్న ధ్యాస..ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైలేదని విమర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్నామన్నారు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఈటల రాజేందర్. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ లో నుమాయిష్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇవాళ కూడా సెలవు కూడా ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా నుమాయిష్‌ను గతంలో లాగే కళకళలాడేలాగా చేస్తామంటోంది ఎగ్జిబిషన్ సొసైటీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com