ముఖ్యమంత్రిగా బాలకృష్ణ..
- February 01, 2019దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ అభిమానులని ఆకట్టుకోలేక పోయింది. ఇక బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా హ్యాట్రిక్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఈ నెలలోనే
ఈ నెలలోనే ప్రారంభం
బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్య చిత్ర కథపై కసరత్తు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. లెజెండ్, సింహ చిత్రాలని మించే రేంజ్ లో బోయపాటి శ్రీను ఈ చిత్ర కథని పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులంతా బాలయ్య, బోయపాటి చిత్రం కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.
ముఖ్యమంత్రి పాత్రలో
ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాలయ్య నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయని.. ఆ తరహాలో బోయపాటి కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..