సైబర్ సెక్యూరిటీ: 25 మంది సౌదీ చిన్నారులకు శిక్షణ
- February 01, 2019
జెడ్డా: సౌదీ ఫెడరేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ అండ్ డ్రోన్స్ (ఎస్‌ఎఎఫ్‌సిఎస్‌పి), 'ప్రోగ్రామింగ్ ఫర్ యంగ్ సౌదీస్' పేరుతో ఈవెంట్ నిర్వహించింది. రియాద్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో ఒరాకిల్ సంస్థతో కలిసి శిక్షనా శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ఇందులో 25 మంది సౌదీ చిన్నారులు పాల్గొన్నారు. 8 నుంచి 14 ఏళ్ళ వయసు గల ఈ చిన్నారులకు జవా మరియు పైథాన్ వంటి లాంగ్వేజెస్ ద్వారా సైబర్ సెక్యూరిటీపై ట్రైనింగ్ ఇచ్చారు. స్క్రాచ్, అలీస్, గ్రీన్ ఫుట్ వంటి ప్లాట్‌ఫామ్స్ గురించి తెలియజేశారు. చిన్నారుల్లో సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పించడమే ఈ ట్రైనింగ్ ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ ప్రోగ్రామ్‌ని ఉదయం 8 గంట లనుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. పాల్గొన్న ప్రతి చిన్నారికీ సర్టిఫికెట్‌ని అందజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..