వైఎస్ఆర్‌లా చేయడం కష్టం అనిపించింది - మమ్మూట్టి
- February 03, 2019
ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలోని ప్రముఖ ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మాళయాళ సూపర్‌స్టార్ మమ్మూట్టి నటించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరును పెంచేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మమ్మూట్టి పాల్గొన్నారు. సినిమా విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు మమ్మూట్టి.
సినిమా కథ వినగానే ఇది నేను చేయాల్సిన సినిమా అని మెంటల్ ఫిక్స్ అయానని తెలిపాడు. అంతకు ముందు వైఎస్ఆర్ గురించి నాకు తెలియదని ,సినిమా చేసే సమయంలోనే ఆయన గొప్పతనం తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన పాదయాత్ర చూసి ,అచ్చం ఆయనలా చేయడానికి ప్రయత్నించానని చూసి ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలని కోరాడు మమ్మూట్టి. వైఎస్ఆర్‌లా చేతులు ఊపడం కష్టంగా అనిపించిందని ఆయన పెర్కొన్నారు. ఇక ఈ సినిమాను తెలుగు,మళయాళ భాషలలో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. జగపతి బాబు,అనసూయలు సినిమాలోని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!