వీడిన జయరాం హత్య మిస్టరీ.. అతనే హంతకుడు
- February 03, 2019
చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీఖా చౌదరి స్నేహితుడు రాకేష్ హత్య చేయించినట్లు తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులతో మర్డర్ చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీఖా చౌదరి తర్వాత రాకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిన్నటి నుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కేసులో మిస్టరీని చేధించారు.
శ్రీఖా చౌదరి, రాకేష్ కు నాలుగున్నర కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ బకాయి సొమ్ముకు జయరాం మధ్యవర్తిగా ఉన్నాడు. కొద్దికాలంగా అప్పు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ కిరాయి హంతకులతో జయరాంను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే రాకేష్ కు ఎవరు సహకరించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జయరాంను ఎక్కడ హత్య చేశారనేది ఇంకా తెలాల్సి ఉంది. పోస్ట్ మార్టమ్ జరిగే సమయానికి సరిగ్గా 24 గంటల ముందు జయరాం చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో 30వ తేదినే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే..మర్డర్ ఎక్కడ జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. శ్రీఖా ఇంట్లోనే హత్య జరిగిందని ముందుగా భావించినా..జయరాం 29న ఆమె ఇంటికి వెళ్లి…ఆ రోజు సాయంత్రమే తిరిగి వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ రికార్డులో ఉంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







