ఇక ధనాధన్ ‘టి20’ పోరు
- February 04, 2019
న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ లో 4-1తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా ఇక టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. టెస్టులు, వన్డేలలో అగ్రశ్రేణి జట్టుగా నిరూపించుకుంటున్న భారత క్రికెట్ జట్టు ట్వంటీ 20 మ్యాచ్ ర్యాంకింగ్ లలో పాకిస్థాన్ కంటే 8 పాయింట్లు వెనుక బడింది. ఆస్ట్రేలియాలో టెస్టులు, వన్డేలలోనూ, న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ లోనూ సత్తా చాటి, సంపూర్ణ ఆధిపత్యం వహించిన టీమిండియా టి20 రికార్డులను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలని, పాకిస్థాన్ ను అగ్రస్థానం నుంచి తప్పించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన వెల్లింగ్టన్ లో, రెండో టి20 మ్యాచ్ 8వ తేదీన ఆక్లాండ్ లో, మూడో మ్యాచ్ 10వ తేదీన హామిల్టన్ లో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ రాత్రివేళల్లోనే నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా