చైనీస్ న్యూ ఇయర్‌కి స్వాగతం పలుకుతున్న షాంగ్రి లా హోటల్, దోహా
- February 04, 2019
దోహాలోని షాంగ్రి లా హోటెల్, చైనీస్ కొత్త సంవత్సరానికి స్పెషల్ ట్రీట్స్‌తో స్వాగతం పలుకుతోంది. షాంగ్రి క్లబ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ప్రత్యేకంగా ఫెస్టివల్ నిర్వహిస్తూ, విభిన్నమైన రుచుల్ని ఆహార ప్రియులకు, ప్రత్యేకంగా చైనీయులకు అందించబోతున్నారు. డీప్ ఫ్రైడ్ లాబ్ స్టర్స్ - మయాన్నైస్, మ్యాంగో సాల్సాతో కలిపి చేసే వంటకం వీటిల్లో అతి ముఖ్యమైనది. అలాగే స్టీమ్డ్ సిల్వర్ కోడ్ - స్కాలియన్స్ - సూపర్ సాయ్ సాస్ (హాంగ్ కాంగ్ స్టయిల్) మరో ఆకర్షణ. చైనీస్ ఛెఫ్‌లతో వండించిన మరిన్ని ప్రత్యేక వంటకాలు చైనా న్యూ ఇయర్‌కి ఘనంగా స్వాగతం పలకనున్నాయని రెస్టారెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. షాంగయ్ క్లబ్, 43వ ఫ్లోర్‌లో 360 డిగ్రీల కోణంలో సిటీని చూసేలా వుంటుంది. డ్నిర్స్ టూ ఎయిట్ కోర్స్ మెనూస్‌తో 288 ఖతారీ రియాల్స్, 388 ఖతారీ రియాల్స్ (ఒక్కో వ్యక్తికి) అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







