హీరో తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత.. బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత
- February 04, 2019
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సినీ హీరో తారకరత్నకు సంబంధించిన డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వారి ఫిర్యాదుతోనే రెస్టారెంట్‌ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







