రికార్డు సృష్టించిన కుంభమేళా

- February 05, 2019 , by Maagulf
రికార్డు సృష్టించిన కుంభమేళా

యూపీ: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవరి 4వ తేదీ సోమవారం ఈ రికార్డ్ క్రియేట్ అయ్యింది. సోమవారం మౌని అమావాస్య. దీంతో ఒక్క రోజే 5 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మౌని అమావాస్యను కుంభమేళాలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారని, వారిని స్మరిస్తూ పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. నాగా సాధువులుగా మారాలనుకునే వారు మౌని అమావాస్య రోజునే దీక్ష తీసుకున్నారు. మౌని అమావాస్య రోజున గంగా నదిలో నీళ్లు అమృతంగా మారుతాయని శాస్త్రోక్తి. అందుకే ఈ రోజున గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

కుంభమేళాలో మూడు సాహ్నీ స్నానాలు ఉంటాయి. తొలి స్నానం కుంభమేళా ప్రారంభమైన మకర సంక్రాంతి రోజు, రెండో మౌని అమావాస్య రోజు, మూడోది వసంత పంచమి (ఫిబ్రవరి 10)న ఉంటాయి. ప్రయాగ్ రాజ్‌లో భక్తుల రాక అంతకంతకూ పెరుగుతోంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. జైన తీర్థంకరుల్లో మొదటివాడైన రిషభదేవుడు మౌని అమావాస్య రోజున తన మౌన వ్రతాన్ని విరమించి, పుణ్య నదుల్లో స్నానం చేశాడని జైనులు నమ్ముతారు. దీంతో జైనులు కూడా మౌని అమావాస్య రోజున భారీగా తరలివచ్చి స్నానాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com