కొత్త ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కోసం బహ్రెయిన్‌ సిద్ధం

- February 08, 2019 , by Maagulf
కొత్త ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కోసం బహ్రెయిన్‌ సిద్ధం

మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపల్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ - రోడ్‌ ప్లానింగ్‌ మరియు డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎం కజెమ్‌ అబ్దుల్‌ లతీఫ్‌ మాట్లాడుతూ, మినిస్ట్రీ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో కలిసి ట్రాఫిక్‌ లైట్‌ సిగ్నల్స్‌ సిస్టమ్‌ని మరింత అభివృద్ధి చేసే విషయమై చర్చలు జరుపుతోందని అన్నారు. గ్రీన్‌ లైట్‌ ఫ్లాషింగ్‌ని కింగ్‌డమ్‌లోని రోడ్లపై అమలు చేయడం ఈ కొత్త సిస్టమ్‌ తాలూకు ఉద్దేశ్యం. గ్రీన్‌ నుంచి రెడ్‌ లైట్‌ వైపు మారే క్రమంలో 3 సెకెన్లపాటు ఫ్లాష్‌ చేస్తారు కొత్త విధానంలో. ఫిబ్రవరి 8 నుంచి దీన్ని లాంఛ్‌ చేస్తున్నారు. రెడ్‌ సిగ్నల్‌ పడే ముందు డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఈ ఫ్లాస్‌ విధానం ఉపయోగపడ్తుంది. అల్‌ ఫతెహ్‌ హైవే, షేక్‌ దాయిజ్‌ అవెన్యూ వద్ద అలాగే వాడి అల్‌ అహా రోడ్‌ మరియు మిలిటరీ హాస్పిటల్‌ ఎంట్రన్స్‌ వద్ద ప్రయోగాత్మకంగా వీటిని తొలుత ప్రవేశపెడుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com