జపాన్ విలేజ్ ప్రారంభం
- February 09, 2019
బహ్రెయిన్:సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, జపాన్ విలేజ్‌ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఈ తొలి జపనీస్ ఎక్స్పో ప్రారంభమయ్యింది. జదరన్ గవర్నరేట్ ఈ ఈవెంట్‌ని బహ్రెయినీ జపనీస్ ఫ్రెండ్షిప్ సొసైటీ అలాగే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌తో కలిసి ఏర్పాటు చేసింది. లేబర్ ఫండ్ (తమ్కీన్) సహాయ సహకారాలు అందించింది. బహ్రెయిన్ అలాగే పలు ఇతర దేశాల నుంచి 28 పార్టీస్ మూడు రోజుల ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్పోని ప్రారంభించడం చాలా ఆనందంగా వుందని షేక్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్, జపాన్ మధ్య స్నేహపూర్వక వాతావరణం వుందనీ, బహ్రెయిన్‌లో జపనీయులు సంతోషంగా వున్నారనీ వివరించారాయన. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







