భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి
- February 09, 2019
షార్జా:32 ఏళ్ళ ఇండియన్ వలసదారుడు గోప కుమార్, ఓ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ మజారా ప్రాంతంలోగల ఖాన్ సాహెబ్ బిల్డింగ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోప కుమార్ కేరళకు చెందిన వ్యక్తి. మెయిన్‌టెనెన్స్ వర్కర్‌గా పనిచేస్తున్న గోపకుమార్, వాచ్‌మెన్‌తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నారు. పైనుంచి కింద పడిన వెంటనే గోపకుమార్ ప్రాణాలు కోల్పోయాడని హుటాహటిన అక్కడికి చేరుకున్న అధికారులు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే అతనిది ఆత్మహత్య అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వాచ్‌మెన్‌ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గోపకుమార్ స్నేహితుడు మాట్లాడుతూ, తమ స్నేహితుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..