అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నాకు దిగిన భారతీయులు

అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నాకు దిగిన భారతీయులు

అమెరికాలో భారతీయులు వైట్ హౌస్ ముందు ధర్నాకు దిగారు. గ్రీన్ కార్డు ధరఖాస్తు చేసుకున్న తమ ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని కోరుతూ సుమారు 12వందల మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వద్దకు చేరుకున్న గ్రీన్ కార్డు ధరఖాస్తుదారులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. H1B వీసాపై వచ్చి దశాబ్ధానికి పైగా ఇక్కడే ఉన్నా గ్రీన్ కార్డులు ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న కోటా ప్రకారమే ఇవ్వాలనుకుంటే..ప్రస్తుతం ధరఖాస్తులు క్లియర్ చేయడానికి వందేళ్లు పడుతుందంటున్నారు. గత ఏడాది మార్చిలో కూడా ఇదే తరహా పోరాటం చేశారు. వీరి ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ బిల్లులో కొన్ని అంశాలు చేర్చి.. కాంగ్రెస్ లో పెట్టారు. కానీ బిల్లు వీగిపోయింది. మరోసారి దీనిపై పోరాటానికి ఎన్నారైలు సిద్దమయ్యారు.

కాశ్మీర్లో మరోసారి తెగబడ్డ తీవ్రవాదులు
ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోకి అక్రమంగా వలసవచ్చిన వారి పట్ల మానవతా దృక్పథంతో దేశంలో ఉండేలా అనుమతించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇది మరింత ఆగ్రహాలకు కారణమవుతోంది. ముందుగా లీగల్ గా అమెరికా వచ్చిన తమ సంగతి తేల్చకుండా అక్రమంగా చొరబడినవారికి పౌరసత్వం ఇవ్వాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగల్ గా అమెరికా వచ్చి దశాబ్ధానికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి వెంటనే పౌరసత్వం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లికన్ హిందూ కొహలేషన్ సంస్థ ప్రతినిధులు యష్ బొద్దలూరి, కృష్ణ బన్సల్ నేతృత్వంలో ఈ ధర్న చేపట్టారు.

Back to Top