నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం చెప్పిన సూర్య
- February 11, 2019
సంచలనం రేపిన బుల్లితెర నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త కొణాలు వెలుగులోకి వస్తున్నారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కొత్త విషయాలను బయటపెట్టాడు సూర్య. ఝాన్సీకి బాబీ , గిరిలు ఫొటో షూట్ చేసేవారిని వారి నమ్మొద్దని పలుమార్లు చెప్పినట్లు తెలిపాడు. గిరి సినిమా ఛాన్స్ పేరుతో ఝాన్సీని మోసం చేశాడని విచారణలో పేర్కొన్నాడు. సినీ ఆఫర్లు లేకే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఝాన్సీ విషయంలో ఒకసారి గిరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపాడు సూర్య. దీంతో బాబీ, గిరిని కూడా పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…
మరో వైపు తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులను కోరారు. ఝాన్సీ ఇంట్లోనూ పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆమె డైరీని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. సూర్య ఇదివరకే మధు అనే సీరియల్ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది..
మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్ చేశాడని సమాచారం. సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను ఝాన్సీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించి మృతురాలి తల్లి, సోదరుని వాంగ్మూలాన్నీ నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!