భారత్‌లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ
- February 15, 2019
భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిని యూఏఈ ఖండించింది. జమ్మూకాశ్మీర్‌లో తీవ్రవాదులు, నిన్న జరిపిన మారణహోమంలో 39 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఓ ప్రకటన ద్వారా ఈ ఘటనను ఖండించడం జరిగింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలనీ, ఆధునిక సమాజంలో హింసకు తావులేదని యూఏఈ ఆ ప్రకటనలో పేర్కొంది. మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు యూఏఈ మినిస్ట్రీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







