కాశ్మీర్లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్
- February 16, 2019
మస్కట్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన తీవ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించింది ఒమన్. ఈ ఘటనలో భారత పారామిలిటరీ ఫోర్స్‌కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఒమన్, సంతాప ప్రకటనలో పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఈ దాడి జరగడం తమకు బాధ కలిగించిందనీ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే క్రమంలో భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఒమన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఒమన్ పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







