వీకెండ్ అలర్ట్: ఈ ముఖ్యమైన రోడ్ల మూసివేత
- February 22, 2019
అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆప్ ట్రాన్స్‌పోర్ట్, కొన్ని ముఖ్యమైన రోడ్లకు సంబంధించి వీకెండ్‌లో మెయిన్‌టెనెన్స్ చర్యల నిమిత్తం 'క్లోజర్'ని అమలు చేస్తోంది. అబుదాబీ - అల్ అయిన్ రోడ్డు (ఇ22), ఇ11 నుంచి ఘ్వెఫాట్ వైపు రోడ్డు ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు తాత్కాలిక పాక్షిక క్లోజర్ అమల్లో వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు మ్యాప్‌ని పోస్ట్ చేసిన అధికారులు, దానికి అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. అల్ ముస్తక్‌బాల్ స్ట్రీట్ మరియు అల్ రయా స్ట్రీట్‌ని 12 గంటల నుంచి అర్థరాత్రి వరకు స్ట్రీట్ ఫెస్టివల్ కారణంగా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు అల్ ముల్తుకా స్ట్రీట్‌ని ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







