కుప్పకూలిన క్రేన్: కార్మికుడి మృతి
- February 25, 2019
ఆసియాకి చెందిన కార్మికుడొకరు అబుదాబీలోని అల్ రహా బీచ్ వద్ద కన్స్ట్రక్షన్ సైట్లో ఓ క్రేన్ కుప్పకూలడంతో మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి పెట్రోల్స్, అంబులెన్స్ చేరుకున్నాయనీ, తక్షణ సహాయ చర్యల అనంతరం గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. అల్ ముఫ్రాక్ మరియు అల్ రహ్బా హాస్పిటల్స్‌కి గాయపడ్డవారిని తరలించారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ డిపార్ట్మెంట్ - డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీమ్ అలి జలాల్ బలౌషి మాట్లాడుతూ, నిర్మాణ సంస్థలు తగినన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రేన్లను రెగ్యులర్‌గా మెయిన్టెనెన్స్ చేయడం ద్వారా ప్రమాదాల్ని నియంత్రించవచ్చునని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







