అభినందన్ కు ఏమైనా జరిగితే ఖబర్దార్; పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్

- February 28, 2019 , by Maagulf
అభినందన్ కు ఏమైనా జరిగితే ఖబర్దార్; పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్

పాక్ చెరలో ఉన్న ఐఏఎఫ్ పైలట్ అభిందన్ వెంటనే విడుదల చేయాలని భారత్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. సరిహద్దుల ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ విదేశాంగశాఖ డిప్యూటీ కమిషనర్ హైదర్ షాకు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. సమన్ల వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేఫథ్యంలో ఆయన ఐఏఎఫ్ అధికారుల సమక్షంలో హాజరయ్యారు.

హైదర్ షాకు నీలదీత
ఈ సందర్భంగా అభిందన్ పట్ల పాక్ వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ నిబంధనలు వ్యతిరేకంగా గాయపడ్డ అభినందన్ పట్ల పాక్ దురుచుగా ప్రవర్తించడం పట్ల భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అభిందన్ కు ఏమనైనా జరిగితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

తమ పోరాటం ఉగ్రవాదులపైనే..
పాక్ ఉన్న ఉగ్ర క్యాంపుల గురించి పాక్ సమాచారం ఇచ్చామని పాక్ చర్యలు తీసుకోకపోవడం వల్లే తాము చర్యలు తీసుకుంటున్నామని భారత్ వివరణ ఇచ్చింది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే కానీ పాక్ ప్రజలపై కాదని భాతర్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com