తీవ్రవాదాన్ని తిరస్కరించిన భారత ముస్లింలు: సుష్మా స్వరాజ్
- March 01, 2019
విషం చిమ్మే తీవ్రవాదాన్ని భారత ముస్లింలు సహించబోరని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. అబుదాబీలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్‌లో పాల్గొన్న సుష్మా స్వరాజ్ భారత స్వరాన్ని బలంగా విన్పించారు. ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా శాంతినే నమ్ముతోన్న దేశం తరఫున తాను ఈ సమావేశంలో ప్రాతినిత్యం వహిస్తున్నాననీ, ఇది తనకు గర్వంగా వుందని అన్నారామె. ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని ఆమె అన్నారు. 1.3 బిలియన్ ఇండియన్స్ అందులో 185 మంది ముస్లిం సోదరులు, సోదరీమణుల శుభాకాంక్షల్ని తాను తీసుకొచ్చినట్లు సుష్మ పేర్కొనడం గమనార్హం. భారతదేశంలో ముస్లింలు కూడా భాగమనీ, ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషల్ని ముస్లింలు అనుసరిస్తున్నారని, వారంతా భారతదేశంలో క్షేమంగా వున్నారనీ, వుంటారని సుష్మా స్వరాజ్ అన్నారు. తీవ్రవాదాన్ని ఎవరూ ఉపేక్షించరాదనీ, ప్రపంచానికి తీవ్రవాదం పెనుముప్పుగా మారిందని చెప్పారామె.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







