పాకిస్తాన్ ప్రధానితో సౌదీ మంత్రి భేటీ

- March 08, 2019 , by Maagulf
పాకిస్తాన్ ప్రధానితో సౌదీ మంత్రి భేటీ

ఇస్లామాబాద్‌:భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన అత్యున్నత రాయబారి ఒకరు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో గురువారం భేటీ అయ్యారని, యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పంపిన ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి చేరవేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అడెల్‌ అల్‌ జుబేర్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో ఆయన నివాసంలో సమావేశమైనట్లు జియో టీవీ వెల్లడించింది. ఇరువురి మధ్య.. ప్రస్తుతం భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయని వివరించింది. ఈ సందర్భంగా యువరాజు పంపిన ప్రత్యేక సందేశాన్ని జుబేర్‌ ప్రధానికి చేరవేశారని పేర్కొంది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, ప్రధానమంత్రి వాణిజ్య సలహాదారు, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు సమాచారం. భారత్‌తో ఉద్రిక్తతలను శాంతియుత మార్గంలో తగ్గించేందుకు తమ దేశం సహకరిస్తుందని జుబేర్‌ ఈ సందర్భంగా ఖురేషీకి హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com