వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్

భారత్‌లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత ప్రభుత్వం వినతి మేరకు లండన్ పోలీసులు, నీరవ్ మోదీని అరెస్టు చేశారు. కాసేపట్లో అతన్ని కోర్టులో ప‌్రవేశ పెట్టనున్నారు. చట్టపరమైన ప్రక్రియ తర్వాత నీరవ్‌ను మనదేశానికి అప్పగించే పని మొదలు కానుంది.
 
నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు 13 వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయారు. అతను లండన్‌లో ఎక్కడ ఉంటున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తు న్నాడో టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. అప్పటికే అతన్ని మళ్లీ భారత్‌కు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సీబీఐ, ఈడీలు… టెలిగ్రాఫ్ కథనంతో అలర్ట య్యాయి. నీరవ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఈనెల 9వ తేదీన లండన్‌లోని హోం శాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబం ధించి నీరవ్‌ను తమకు అప్పగించాలని లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్పందించిన కోర్టు, నీరవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Back to Top