రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం
- March 24, 2019
రోడ్డు ప్రమాదంలో ఓ యువ దర్శకుడు మృతి చెందాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని కన్నడ దర్శకుడు హ్యరిస్ హౌదాల్ గా గుర్తించారు. హ్యరిస్ నిద్రమత్తులో ఉండి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు వెళ్తుండగా ప్రమాదం ఛోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హ్యారిస్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







