ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి 30లక్షల వితరణ
- December 30, 2015
మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఈఘటన. చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి కూరగాయల రథాన్ని వితరణ చేశారు. అబ్దుల్ గనీ అనే భక్తుడు రూ.30లక్షల విలువైన రథాన్ని తయారు చేయించి శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకొచ్చారు. రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణాశాఖకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగాదాత అబ్దుల్ గనీని... తితిదే డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సత్కరించారు. అబ్దుల్ గనీ గతంలో తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు వితరణగా అందజేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







