ఎంట్రీ వీసా: భారత్ - కువైట్ మధ్య ఒప్పందం
- March 28, 2019
కువైట్ సిటీ: డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ పాస్పోర్ట్స్కి సంబంధించి మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎంట్రీ వీసాపై భారత్ - కువైట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 19 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది. 2018 అక్టోబర్ 31న ఈ ఒప్పందం కుదిరింది. ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఆర్టిక్ 2 ప్రకారం ఆర్టికల్ పరిధిలోకి వచ్చే ఇరు దేశాలకు చెందిన పౌరులు, వీసా లేకుండానే ఆయా దేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 60 రోజుల పాటు వెళ్ళి, అక్కడ వుండేందుకు వీలు కలుగుతుంది. ఆర్టికల్ 4 ఆఫ్ ది అగ్రిమెంట్ ప్రకారం పైన పేర్కొనబడిన పాస్పోర్ట్స్ వున్నవారు తమ స్టేని పొడిగించుకోవడానికి సంబంధిత వర్గాలతో సంప్రదించాల్సి వుంటుంది. అయితే పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 నెలలకు మించి వుండాలి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!