నాన్నకు ప్రేమతో తొలి ఆడియో సీడీను నాన్నకు ఇచ్చా
- December 30, 2015
రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉండగా, ఈయన మ్యూజిక్ అంటే చెవి కోసుకునే సంగీత ప్రియులు ఎందరో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో ఇటీవల విడుదల కాగా, ఈ ఆల్బం మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.దేవి శ్రీ ఫాదర్ సత్యమూర్తి ఇటీవల గుండెపోటుతో మరణించగా, ఆయన మరణం దేవిని ఎంతగానో కలచి వేసింది. తన ప్రతీ విజయం వెనుక తండ్రి ఉన్నారనే భావించే దేవి తన తండ్రి మరణాన్ని అసలు తట్టుకోలేకపోయారు. అయితే ఆ సమయంలో కూడా తండ్రి కోరిక మేరకు, చనిపోయిన రెండు రోజుల తర్వాత నాన్నకు ప్రేమతో మ్యూజిక్ పనులను మొదలు పెట్టారు దేవి శ్రీ.దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి చిత్రం దేవి నుండి ఇప్పటి వరకు తొలి ఆడియో సీడిను తన తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోగా, నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో రిలీజ్ సమయానికి తన తండ్రి లేకపోవడం ఈ సంగీత దర్శకుడిని మరింత బాధకు గురి చేసింది. దీంతో దేవి ఈ సారి నాన్నకు ప్రేమతో తొలి ఆడియో సీడీను నాన్నకు ఇచ్చానంటూ ట్విట్టర్లో ఓ ఫోటోను పోస్ట్ చేసారు. తన తండ్రి ఫోటో దగ్గర సీడీ పెట్టిన ఆ ఫోటో అభిమానులను ఎంతగానో కదిలించింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









