పది, ఇంటర్ అర్హతతో బీఎస్ఎఫ్లో హెడ్‌కానిస్టేబుల్ ఉద్యోగాలు..
- April 19, 2019
భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కమ్యూనికేషన్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పురుషులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పదవతరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 1072 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 300 హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) : 772
అర్హత: పదవతరగతి, ఇంటర్ (ఎంపీసీ లేదా తత్సమాన విద్యార్హత ఉండి) 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. (లేదా) సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.06.2019 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష, పీఎస్టీ/పీఈటీ, డాక్యుమెంటేషన్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా
ముఖ్యమైన తేదీలు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.05.2019 (మ. 1.00 గం. నుంచి) ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2019 (రా.11.59 గం. వరకు) స్క్రీనింగ్ టెస్ట్: 28.07.2019 డిస్క్రిప్టివ్ టెస్ట్: 24.11.2019 మెడికల్ టెస్ట్: 30.01.2020
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







