గల్ఫ్ బాధితుడికి అండగా నిలిచిన తెలంగాణ జాగృతి కువైట్ శాఖ
- May 02, 2019
కువైట్:ఉపాధి కోసం ఏజెంట్లను నమ్మి లక్షలు అప్పు చేసి గల్ఫ్(కువైట్)లో నానా కష్టాలు పడిన నిర్మల్ జిల్లా. కడం మండలం. లింగపూర్ గ్రామానికి.చెందిన. శేఖర్ అడ్వాలకు తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అండగా నిలిచింది.అతన్ని. స్వదేశానికి చేర్చడంలో సహాయం అందించారు.
శేఖర్ అడ్వాల కువైట్ స్పాన్సర్ ఇంట్లో పనికి వచ్చారు వచ్చిన కొద్ది రోజులకే కువైట్ వాళ్లు మానసికంగా చాలా బాధించడం జరిగింది. ఈ విషయం కువైట్ జాగృతి అధ్యక్షులైన ముత్యాల వినయ్ ని సంప్రదించడం జరిగింది. వెంటనే వినయ్ కుమార్ శేఖర్ అడ్వాల కు ఉన్న ఇబ్బందులను తెలుసుకొని శేఖర్ ని కువైట్ ఎంబసీ తీసుకెళ్లి వారంరోజులకే వారి సమస్యలను పరిష్కరించి వెంటనే శేఖర్ ను సురక్షితంగా జాగృతి తరఫున మన తెలంగాణకు చేర్చడం జరిగింది.
జాగృతి కువైట్ శాక అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ విజయనిర్మల,జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్ మరియు జాయింట్ సెక్రెటరీ , మామిడిపల్లి రాజన్నా,వారం రాజశేఖర్, రమేష్ విజ్డం ఎంతో ధైర్యాన్ని చెబుతూ తమ సహాయాన్ని అందిస్తూ స్వదేశానికి వెళ్లే వరకు ఎంతో తోడ్పాటు అందించారు.
గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ఎంతో చొరవ చూపిస్తున్న ఎంపీ కవిత కి మా హృదయపూర్వక అభినందనలు మీ సహా సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..