అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ అడ్మిషన్స్ ప్రారంభం
- May 03, 2019
బహ్రెయిన్: కింగ్డమ్లో తొలిసారిగా అమెరికన్ స్టయిల్లో నిర్మితమైన యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్, సెప్టెంబర్ 2019 టెర్మ్ కోసం అడ్మిషన్స్ ప్రాసెస్‌ని ప్రారంభించింది. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మే 4న బహ్రెయిన్ హోటల్ బేలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాలుగు సెషన్లు 'ఓప్ డే' నిర్వహించనుంది. యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ విభాగాల్లో డిగ్రీ కోర్సుల్ని యూనివర్సిటీ అందించనుంది. ఎయుబిహెచ్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుసాన్ ఇ సాక్స్ట్ మాట్లాడుతూ, విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన చాలా ఆనందంగా వుందని చెప్పారు. అత్యంత సమర్థులైన ఫ్యాకల్టీ ద్వారా తమ యూనివర్సిటీలో మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..