దుబాయ్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి అస్వస్థత

- May 06, 2019 , by Maagulf
దుబాయ్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి అస్వస్థత

దుబాయ్‌లోని షేక్‌ జాయెద్‌ రోడ్డులోగల ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్‌ పోలీస్‌ ఓ ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకున్న సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌ మంటల్ని సకాలంలో అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హోటల్‌లోని సౌనా రూమ్‌లో ఈ షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే హోటల్‌ని ఖాళీ చేయించారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ పీల్చడం వల్ల ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య చికిత్స అందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com