డిగ్రీ అర్హతతో నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు..
- May 09, 2019
న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మరింగ్ ఇండియా (నీతి ఆయోగ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీలు: 60 ఒప్పందకాలం: రెండేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు
మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ లీడ్ పోస్టులు: ఖాళీలు 10 ఒప్పందకాలం: రెండేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు
ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు: ఖాళీలు 2 ఒప్పందకాలం : రెండేళ్లు అర్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లు మించకూడదు
ఇన్నోవేషన్ లీడ్ (అటల్ ఇన్నోవేషన్ మిషన్): ఖాళీలు 12 ఒప్పందకాలం: మూడేళ్లు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ: మే22, 2019 వెబ్‌సైట్: https://niti.gov.in
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







