ఎయిరిండియా బంపరాఫర్
- May 10, 2019
ప్రయాణీకులకు ఎయిరిండియా శుక్రవారం బంపరాఫర్ ప్రకటించింది. చివరి నిమిషంలో బుక్ చేసుకునే టిక్కెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిరండియా ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన వాణిజ్య సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది.
ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్
చివరి నిమిషంలో ట్రావెల్ చేసే సాధారణ ప్రయాణీకులు అర్జెన్సీ కారణంగా వస్తారని, అలాంటి వారు టిక్కెట్ కోసం ఎక్కువ ప్రైస్ చెల్లిస్తున్నారని, ఇలాంటి అధిక ధరలు ప్రతిబంధకంగా మారాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం తాము ప్రకటించిన డిస్కౌంట్ రేపటి నుంచి (11 మే) నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. సాధారణంగా చివరి నిమిషంలో టిక్కెట్ కొనుగోలు చేసే వారికి 40 శాతం నుంచి అంతకంటే ఎక్కువ రేట్లు ఉంటాయి. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్ ప్రకటించింది. అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినట్లో బుకింగ్‌లపై దాదాపు యాభై శాతం తగ్గింపు వర్తింప చేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!